

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ //
జమ్మికుంట..భద్రాద్రి బ్యాంకు 23వ శాఖను గురువారం జమ్మికుంటలో ప్రారంభించారు. జమ్మికుంట కొండూరు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ ను భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ కృష్ణమూర్తి ప్రారంభించారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ ని శ్రీరామ్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ డాక్టర్ ముక్క రాము ప్రారంభించారు. మరియు క్యాష్ కౌంటర్ నీ జిల్లా సహకార అధికారి సముద్రాల రామానుజాచార్య ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ..ఒక శాఖతో ప్రారంభమై, అంచల అంచలుగా నేడు 23వ శాఖను ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. తమ బ్యాంకులో అన్ని బ్రాంచుల్లో 70000 ఖాతాదారులు ఉన్నారని బ్యాంకు లో వెయ్యికోట్ల టర్నోవర్ కలిగి ఉంది అన్నారు. బ్యాంకు ఖాతాదారులు గృహ వ్యాపార చిన్న తరహా పరిశ్రమలు ఎడ్యుకేషన్ అన్ని రకాల రుణాలు ఇస్తున్నామన్నారు. జిల్లా ప్రజలకి తమ బ్యాంకు అన్ని రకాల సేవలందిస్తుందని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ సమ్మె ఉదయ్ ప్రసాద్ వేములపల్లి వెంకటేశ్వరరావు, సీఈవో దాసరి వేణుగోపాల్, డైరెక్టర్లు రాజారావు, పిచ్చయ్య, నాగ శ్రీనివాస్, జీవన్, రామ్, జమ్మికుంట ప్రముఖులు రాజేంద్రప్రసాద్, భీమ్రావు నరేందర్రావు, వెంకటేశ్వర్లు, సుంకరి రమేష్, మైస మహేందర్, బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

