Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం


భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా రాష్ట్ర పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి పిలుపు మేరకు శాయంపేట మండలం పెద్ద కొడ పాక గ్రామంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలం నుంచి వివరిస్తూ రైతులందరికీ రుణ మాఫీ పూర్తి స్థాయిలో చెల్లించాలని, తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, రైతు భరోసా రైతులందరికీ చెల్లించాలని, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లేషన్ పేరుతో అనేక హామీలు వాగ్దానాలు చేసిందని, ఎన్నికల ముందు కోతలు కోసిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత ఎగవేతలను నమ్ముకుని కుంటి సాకులతో రైతులకు ఇచ్చిన అన్ని హామీల్లో వాగ్దానాల్లో కోతలు పెడుతూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారు అని మండిపడ్డారు. గత కెసిఆర్ ప్రభుత్వం రైతంగానే మోసం చేసినట్టే నేడు అంతకంటే దారుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మందికి కూడా రుణమాఫీ చేయలేదని 70 శాతం రైతులకు ఇచ్చారు అని మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎంత మంది రైతులకు రుణ మాఫీ జరిగిందో తెలియజేయాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తు బిజెపి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో నరేంద్రమోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. • ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద నష్టపోయిన పంటకు బీమా సదుపాయాన్ని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి 6000 రూపాయల పెట్టుబడి సహాయం. •ప్రధానమత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కింద రైతులకు నెల నెలా 3000 రూపాయల పెన్షన్. •కిసాన్ క్రెడిట్ కార్డులు, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు. •సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన. •సాయిల్ హెల్త్ కార్డులు, సూక్ష్మ వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి ప్రధానమంత్రి కృషి చేశారు. •సోలార్ మోటర్ల కోసం ప్రధానమంత్రి కుసుమ్ పథకం. •జాతీయ వ్యవసాయ మార్కెట్లు. • కిసాన్ రైలు, పశుగణాభివృద్ధి రంగంలో సంస్కరణలు. •వ్యవసాయ గోడౌన్లు, రైతులకు ఋణాలు, కోఆపరేటివ్ సొసైటీలు. •మరీ ముఖ్యంగా వ్యవసాయ చట్టాల ప్రాధాన్యతను, కనీస మద్దతు ధరల పెరుగుదలను గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో దళిత మోర్చా మండల అధ్యక్షులు మంద సురేష్ భూత అధ్యక్షులు మధు దినేష్ వెంకటేష్ కిరణ్ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…