

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతి రావు పూలే 198వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది, ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు, ఎస్ టి యు నాయకులు చిలక వీరయ్య మాట్లాడుతూ తరతరాలుగా అణచివేత గురవుతున్న పేద బడుగు బలహీన వర్గాలకు ఆత్మస్ట్ధైర్యం కల్పించిన మహా మేధావి మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. అస్పృశ్యత అంటరానితనము, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన దీశాలి, అని స్త్రీవిద్య కోసం తన భార్య సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించి స్త్రీ జనోద్ధరణకు కృషిచేసిన మహోన్నత వ్యక్తిత్వం గల నాయకులు , వితంతు పునర్వివాహాల కోసం కృషి చేసిన సంఘసంస్కర్త, సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి వారి యొక్క జీవిత ఆశయాల కోసం అందరం కలిసి ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందిఅని అన్నారు, ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, కుంభ ఏడుకొండ తదితరులు పాల్గొని నివాళులర్పించారు