

జనం న్యూస్ ఏప్రిల్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో సమతా భారత్ ఐక్య వేదిక వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద భారత దేశ తొలితరం సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్ర పటానికి వివిధ సంఘాల నాయకులు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమతా భారత్ ఐక్య వేదిక ప్రతినిధులు బేగంపేట్ ఎయిర్పోర్ట్ సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాడి.ఆనంద్ రావు,డోoగ్రి.ప్రవీణ్ కుమార్ ,సెంటర్ కమిటీ గౌరవ అధ్యక్షులు జాడి.కృష్ణ జీ, పెరుగు.ఆత్మ రావ్, చంద్రీ.పెంటయ్య,లుంబిని దీక్ష భూమి నాయకులు దుర్గం.సుధాకర్, ముంజం.మనోహర్,బంసెఫ్ నాయకులు డోoగ్రి.వాసు దేవ్,జై భీం సేన అధ్యకులు జాడి.వినోద్, భారతీయ బౌద్ధ మహా సభ నాయకులు బోర్కర్,దుర్గం.యశ్వంత్ రావు ,చునర్కర్.శంకర్ తదితరులు పాల్గొన్నారు.