

జనం న్యూస్, ఏప్రిల్ 12, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఈరోజు పెద్దపల్లి జిల్లా బండారి గ్రామం వద్ద దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న సుమారు 85 సంవత్సరాలు ఉన్న వయోవృద్ధున్ని నిన్న సుమారు రాత్రి 11 గంటలకు సమయంలో మసీదు దగ్గర పడి ఉండడంతో ఆ చుట్టు ప్రక్కల వారు పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించగా అతని వద్దకి వెళ్లి వారు వెను వెంటనే తనకీ స్ఫూర్తి మానసిక వికలాంగుల స్కూల్లో టెంపర్వరి షెల్టర్ అందించడం జరిగింది. ఈ సమాచారాన్ని పెద్ద పల్లి ఎస్సై మల్లేష్ గారు జిల్లా మహిళా శిశు సంక్షేమ వయోవృద్ధులు వికలాంగుల శాఖ అయిన DWO వేణుగోపాల్ రావు గారికి అందించగా వెంటనే వారి ఆదేశాల మేరకు ఫీల్డ్ రెస్పాండ్ అధికారి స్వర్ణలత ఆ వయోవృద్దిని వద్దకు వెళ్లి అతని సమాచారం కొరకు ప్రయత్నించి తన వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇట్టి సమాచార నిమిత్తం వెంటనే ఫీల్డ్ రెస్పాండ్ అధికారి స్వర్ణలత వారి కుమారునికి సమాచారాన్ని అందించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వగా వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, మరియు తన ఆరోగ్యం కూడా సహకరించడం లేదని చెప్పడంతో, ఆ వయోవృద్ధున్ని ఆరోగ్య పరిస్థితి నిమిత్తం వెంటనే 108 కి ఫోన్ చేసి అతనిని పెద్దపల్లిలో గల గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించి అక్కడి వైద్య బృందంతో మాట్లాడి తనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరడం జరిగింది. స్వర్ణలత ఎఫ్ఆర్ఓ పెద్దపెల్లి జిల్లా.
