

ఏప్రిల్ 13 జనం న్యూస్(జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్
లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలోని వివిధ హనుమాన్ ఆలయాలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. బిచ్కుంద మండలంలోని మల్కాపూర్ హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి సందర్భంగా భజన కార్యక్రమము మరియు ఉదయం 6 గంటలకు జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు గులాలతో హనుమాన్ దేవునికి పూజా, అభిషేకం చేసినారు. ప్రతి సంవత్సరం లాగానే మందిరం ఆవరణలో ఉన్న ధ్వజస్తంభంపై కొత్త జెండాను ను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు హారతి చేసినారు. అనంతరం భక్తులకు అన్నదానం చేసినారు. ఈ మందిరానికి చిన్న దడిగి, చిన్న దేవాడ, పెద్ద దడిగి గోపనపల్లి, బిచ్కుంద తదితర గ్రామాల నుండి భక్తులు పెద్ద మొత్తంలో హాజరై హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగస్వాములై దేవుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, హనుమాన్లు, సాయిలు, తుకారం, హనుమారెడ్డి భద్రు పాంచాల్ మరియు మాల్కారి భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


