Listen to this article

జనం న్యూస్ 13 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ

గద్వాల్ జిల్లా అయిజ మండల బీఆర్ఎస్వి అధ్యక్షుడిగా కొనసాగుతున్న మత్తాలి అనే నన్ను జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ఆయన ఫోటో పెట్టుకోవడం లేదని,ఆయన గురించి పబ్లిసిటీ చేయడం లేదని, నా వెంట తిరగకుండా ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేల వెంట తిరుగుతున్నావని సస్పెండ్ చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడే మమ్మల్ని అనవసర ఆరోపణలతో సస్పెండ్ చేయడం అనేది భవ్యమైనది కాదని తెలుపుతున్నాము. పార్టీ కోసం కష్టపడి మమ్మల్ని పల్లయ్య పార్టీ కార్యకర్తలకు ఆటంకం కలిగిస్తున్నావని అనడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. నేను ఏనాడైనా వేరే పార్టీ కండువా వేసుకున్నానా?,లేకపోతే మీలాగా ఎక్కడైనా ప్రైవేట్ పాఠశాలల నుండి వస్సుళ్లకు పాల్పడ్డానా? అని ప్రశ్నించారు.మీడియా సోదరులు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా నన్ను సంప్రదించకుండా పత్రికలలో వార్త వేయడం సరైన చర్య కాదని తెలుపుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ లో అనాదిగా పనిచేస్తున్న మమ్మల్ని నిన్న మొన్న వచ్చారు,మేం పదవులు ఇస్తే పబ్లిసిటీ అయ్యారు అనడం సరైన మాట కాదని తెలిపారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు గార్ల నాయకత్వంలో పార్టీ కోసం కష్టపడుతుంటే ఓర్వలేక నిందారోపణలు వేసి సస్పెండ్ చేయడం తగదని అన్నారు.