

విగ్రహ కమిటీ చైర్మన్ కలగూర రాజకుమార్
జనం న్యూస్ 14 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండల కేంద్రం లోని సోమవారం రోజున డా ||బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను పార్టీలకు కులసంఘాలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహ కమిటీ చేర్మన్ కలగూర రాజకుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 2012 సంవత్సరం రాజకీయ కక్షలతో రాత్రికి రాత్రి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది అయినా అప్పటి నుండి దళిత ఎమ్మెల్యే లు ఎంపీ లు పట్టించుకోక పోవడం బాధాకరం అంబెడ్కర్ విగ్రహానికి 3గుంటల ఆబాది భూమి అధికారులు కేటాయించిన కొంతమంది దానిని కబ్జా చేయడం జరిగింది దళిత ఏమ్మల్యే లు అంత ఉన్నత వర్గాలకు కొమ్ము కాయడం వల్లనే అంబేద్కర్ గారి విగ్రహానికి ఏండ్ల తరబడి అవమానం జరుగుతూనే ఉంది అంబెడ్కర్ జయంతి రోజు కూడా అంబెడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే వివేక్ పూల మాల వేయించడం వాళ్ళ కార్య కర్తలకు ఇష్టం లేదంటే ఏ మేర అంబెడ్కర్ విగ్రహానికి అవమానం జరుగుతుందో మండల ప్రజలు దళిత సంఘాల నాయకులు ఆలోచన చెయ్యాలి మొన్న వివేక్ అంబేద్కర్ గారి ప్రోగ్రాం లోనే విగ్రహం మీది నుండి డాటడం వాళ్ళ అనుచర్లు చెప్పులతో తొక్కుకుంటూ నడవడం ఫోటో లు అన్ని వాట్సప్ గ్రూప్ లల్లో చూసినం దళిత నాయకులు పోలీస్ లకు పిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికన్నా కను విప్పు జరగాలని ఎమ్మెల్యే అనుచరుల మాటలు కాకుండా అధికారులతో పూర్తి సమాచారం తెప్పించుకొని అంబెడ్కర్ విగ్రహ విషయం లో ముందుకు వెళ్లాలని పెద్ద విగ్రహం ఏర్పాటుకు కటాయించిన స్థలాన్ని కబ్జా కోరుల నుండి విడిపించి విగ్రహం ఏర్పాటు చేయాలనీ ఆవేదన వ్యక్తం చేశారు