Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 14

తర్లుపాడు మండల మరియు పరిసర గ్రామ ప్రజలకు తర్లుపాడు గ్రామం అనాదిగా ప్రసిద్ధిగాంచినది రాజులు మరియు బ్రిటిష్ వారి పరిపాలనలో తర్లుపాడు కేంద్రముగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అలాగే సమితి కేంద్రంగా ప్రస్తుతం మండల కేంద్రంగా విరాజిల్లుతున్నది. అటువంటి తర్లుపాడు గ్రామానికి రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ మొదటి నుంచి ఆగుతున్న రైల్లు కూడా ఆగకపోవడం తర్లుపాడు పరిసర గ్రామాల ప్రజల దురదృష్టకరం ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఈ ప్రాంత ప్రజలు ఎన్ని పర్యాయములు విన్నవించుకున్న ఫలితం దక్కటం లేదు.17253 నెంబర్ గల గుంటూరు వయా నంద్యాల మీదుగా ఔరంగాబాద్ వెళ్లే రైలు గతంలో తర్లుపాడు లో ఆగేది.,అలాగే17228 నెంబరు గల గుంటూరు డోన్ రైలు,17261 గుంటూరు తిరుపతి రైలు మరియు17225 విజయవాడ హుబ్లీ అమరావతి తర్లుపాడు రైల్వే స్టేషన్ లో ఆపాలని మరోసారి రైల్వే అధికారులకు ప్రజా ప్రతినిధులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము