

కడుపునొప్పి-వాంతులు కౌడిపల్లి సమీకృత బాలికల వసతిలో ఘటన
జనం న్యూస్. ఏప్రిల్ 13. మెదక్ జిల్లా. కౌడిపల్లి. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
కలుషిత అల్పాహారం తిని 30 మంది విద్యార్థినిలకు కడుపునొప్పి,వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఆదివారం ఉదయం విద్యార్థినులకు రాగి జావాకు ప్రత్యామ్నాయంగా ఇడ్లీని అల్పాహారంగా పెట్టారు.దీంతో ఇడ్లీ తిన్న 30 మంది విద్యార్థినిలు కడుపునొప్పి,వాంతుల బారిన పడ్డారు.అప్రమత్తమై విద్యార్థినిలు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్ళగా,అక్కడి వైద్యులు పరీక్షించి అల్పాహారం కలుషితమైదని తేల్చారు. అన్నంలో వెంట్రుకలు–తినలేక పోతున్నాం కలుషిత అల్పాహారం తినడం వలనే ఈ దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోయారు.వార్డెన్ నరసమ్మకు పలుమార్లు అన్నంలో వెంట్రుకలు వస్తున్నాయి,తినలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పిన పట్టించుకోవడంలేదని వారి గోడును విలపించారు.ఆపై పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ హాస్టల్’కి తమ పిల్లలను చూసేందుకు ఎప్పుడు వచ్చినా తమతో సమస్యలు ఉన్నాయని తెలిపినట్లుగా పేర్కొన్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పిల్లలకు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. వార్డెన్ నరసమ్మ వివరణ విద్యార్థులకు కడుపునొప్పి,వాంతులు కావడం వాస్తవమే.కొంతమంది విద్యార్థులకు మాత్రమే ఇలా జరిగిందని,ఇడ్లీలో పులుపు ఎక్కువ అవ్వడం వల్ల అస్వస్థతకు గురయ్యారని సమర్థించుకున్నారు.

