

జనం న్యూస్ 14 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు )
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో ప్రపంచ మేధావి, భారత రత్న, భారత రాజ్యాంగ రూపశిల్పి, ఆధునిక భారతదేశ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ మహనీయుని విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గట్టుపల్లి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.