Listen to this article

జనంన్యూస్. 14. నిజామాబాదు. ప్రతినిధి.

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్….

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం కోసం స్థలాలను ప్రభుత్వం ఇచ్చింది కానీ వారికి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోయారు. ఇందిరమ్మ లబ్ధిదారుల కింద ఇళ్ల నిర్మాణం చేసుకుంటామని ప్లాటు వద్దకు వెళ్తే కబ్జాదారులు దాడులకు పాల్పడుతూన్నారు. ప్లాటు మాది మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని హెచ్చరిస్తున్నారు మా ఫ్లాట్లు మాకు ఇప్పించుమని న్యాయం చేయమని స్థానిక ఎమ్మార్వోకు పోలీస్ స్టేషన్ కు గ్రామపంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగిన ఎవరు పట్టించుకున్న పాపాన పోవట్లేదు కొద్దిమంది భూ కబ్జాదారులు పేద ప్రజల ప్లాట్ లను కబ్జాలు చేసుకొని ఇతర వ్యక్తులకు అమ్ముకొని లక్షల రూపాయలు అర్జిస్తున్నారు అని అన్నారు. స్థానిక ఎమ్మార్వో కు ఫిర్యాదు చేసిన సర్వేల పేరు మీద కాలయాపనం చేస్తూ న్యాయం చేయడం లేదని ఫ్లాట్లు పోగొట్టుకున్నవారు వాపోయారు కబ్జాదారులు దొంగ సర్టిఫికెట్లను సృష్టిస్తూ కొనుగోలు చేసిన వ్యక్తులకు సర్టిఫికెట్లను ఇస్తున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇన్ని జరుగుతున్న అధికార పార్టీ నాయకులు గత టిఆర్ఎస్ ప్రభుత్వం దొరల పాలనని ఎన్నో విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూ కబ్జాదారుల నుంచి పేద ప్రజలకు ప్లాట్లను చూపించాలని అధికార పార్టీ వారిని, ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము పేద ప్రజల మధ్య చిచ్చులు పెరిగి భవిష్యత్తులో ఘర్షణలు జరగకుండా చూడాలని మేము కోరుతున్నాము. ఎమ్మార్వో ఆఫీసులో ప్రజల రికార్డ్స్ అన్ని భద్రంగా ఉండాల్సిన ఆఫీసులో పేద ప్రజల ప్లాట్ల సర్టిఫికెట్లు లేకపోవడం మరి దారుణం సర్టిఫికెట్లకు రక్షణ ఉండాల్సిన ఎమ్మార్వో ఆఫీస్ లో అందులో నుంచి రికార్డులు మాయం కావడం అనుమానానికి కి దారి తీస్తుంది ఇప్పటికీ కబ్జాదారుల చేతుల్లో 20 నుంచి 30 ప్లాట్లు వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నట్లు బయట ప్రచారం జరుగుతుంది. కానీ ప్రభుత్వ అధికారులైనవారికి వాళ్లకు ఇప్పించాల్సిన బాధ్యత వారికి ఉన్న . దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకుని కోర్టు ద్వారా ఇంజక్షన్ లెటర్లు తెచ్చుకొని ఇండ్లు నిర్మాణం చేసుకోవడం న్యాయానికి తూట్లు పొడవడం తప్ప మరొకటి కాదన్నారు. కబ్జాకు గురైన ఇళ్ల స్థలాలయజమాని వసంత, కమ్మరి జయ, మచ్చ కంటి ప్రశాంత్ లు ఇప్పటికైనా పేద ప్రజల చేతిలో ఉన్న ప్లాట్ల సర్టిఫికెట్ల ఆధారంగా సర్వే చేయించి ఎవరి ప్లాట్లు వారికి ఇవ్వాలని ప్రభుత్వానికి స్థానిక ఎమ్మార్వో గారికి మేము కోరుతున్నాం లేకుంటే ప్రజల కోపానికి బలికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లో డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య సిపిఐ మండల నాయకులు గడ్డం మోహన్, బిజెపి మండల నాయకులు చెలిమెల నవీన్,
రాజు, మంచి కంటి ప్రశాంత్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు