

జనం న్యూస్, ఏప్రిల్14, అచ్యుతాపురం:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు అచ్యుతాపురం మండలంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని అచ్యుతాపురంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని,ఆయన రాసిన భారత రాజ్యాంగాన్ని భారత పరిపాలన విధానానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. దళితులు హక్కులను సాదించుకోడానికి రాజ్యాంగం ఎంతో ఉపయోగపడిందని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.