

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134 వ జయంతి వేడుకలు సోమవారం యూ టీ ఎఫ్ ఆధ్వర్యంలో నందలూరు ఎం. ఆర్.సీ లో నిర్వ హించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందలూరు MEO 1 ఎల్. నాగయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన అడుగుజాడల్లో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రజాస్వామ్యంలో ఉండే ప్రజానీకానికి అండగా ఉండాలని. నేడు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఉన్నతమైనదిగా ఉన్నది అంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేలా భారతదేశాన్ని ముందుకు నడిపించేలా భవిష్యత్తును ముందుగానే ఆలోచించి భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఆర్థికవేత్త అంబేద్కర్ అని కొని యాడారు.అనంతరం విద్యారంగ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెడ్ మాస్టర్లు షేక్ రౌఫ్ బాష..మలిశెట్టి వెంకట రమణ.యూ.టీ ఎఫ్ నాయకులు ముక్కర హరినాథ్.కాకి రమేష్ జోషి.జీ.కృపానందం. ఎన్.శామ్యూల్ వీరనాల సుధాకర్ ఓ.జే.సురేష్ కె.ఆనంద్.అరెం చిన్న రెడ్డన్న.వీ.ఇమామ్ బాష నాగూరు రవి.ఎస్.టీ.యూ. నాయకులు అల్లం అశోక్ కుమార్.షేక్ షఫీ వుల్ల వై.మహేశ్వర బాబు జంగంశెట్టీ చంద్ర కుమార్.. చలపాటి నరసింహా రావ్ శివ ఫణీంద్ర.ప్రముఖ న్యాయవాది. విశ్రాంత రైల్వే అధికారి ఆనంద్ కుమార్ మహిళా నాయకురాలు సందాని. లక్ష్మమ్మ మల్లీశ్వరి సీ ఆర్.పీ.లు అరుణజ్యోతి ఇందిర సునీత ఎం.ఐ.ఎస్ రమణకంప్యూటర్ ఉద్యోగి శివ ఎం ఆర్.సీ..అటెండేర్ హరినాథ్.స్థానిక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఏ.వరప్రసాద్.. పాటూరు పి యి టీ జగన్.లైబ్రేరియన్ వెంకట సుబ్బయ్య.గొల్లపల్లి రవి విద్యార్థులు.తదితరులు పాల్గొన్నారు.