Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 14.

తర్లుపాడు మండలంలోని లక్ష్మక్క పల్లి స్కూల్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశెట్టి జగన్ మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లోని ‘ మౌ ‘ అనే గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రులకు చివరి సంతానం అనగా 14వ సంతానంగా జన్మించారు. ఆయన తండ్రి పేరు రాంజీ మలోజి సాక్వాల్, తల్లి పేరు బీమా భాయ్. ఆయన పూర్తి పేరు భీమ్ రావు రాంజీ అంబేద్కర్. అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు అతను వేరే పిల్లలతో కలవకుండా మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూలన కూర్చోబెట్టేవారు. మిగతా కులం వాళ్లకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్లు తాగాలంటే ప్యూన్ వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్లు తాగే అవకాశం ఉండేది కాదు. 1912లో బిఏ పూర్తి చేశాడు ఆ తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో 1915 లో 1916 పీహెచ్డీ పట్టాలను పొందాడు. ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివిన అంబేద్కర్ గారు భారత దేశంలో ప్రముఖ లాయర్ గా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. స్వతంత్రం వచ్చాక మొదటి ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అత్యంత కీలకమైన భారత రాజ్యాంగ రచనలో ప్రముఖుడిగా ఉన్నాడు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా నియమింపబడ్డాడు. 65 ఏళ్ల వయసులో 1956 డిసెంబర్ 6వ తేదీన ఆయన మరణించారు. ఆయన భారతదేశానికి చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1990లో మరణాంతరం భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు sk అబ్దుల్ షుకూర్ పాల్గొన్నాడు.