

జనం న్యూస్ ఏప్రిల్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆధునిక భారతదేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆర్థికవేత్త,రాజకీయవేత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో గల రిక్షా పుల్లర్స్ కాలనీలో ఆ మహనీయునికి పూలమాలవేసి నివాళులు అర్పించిన డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేసినటువంటి మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారు రచించినటువంటి భారత రాజ్యాంగంలోనీ ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించి, అలాగే నూతనంగా నిర్మించినటువంటి రాష్ట్ర సచివాలయానికి వారి పేరు పెట్టడం వల్ల వారికి తగిన గౌరవం ఇచ్చారని కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ఆ విగ్రహానికి పూలమాల వేసిన పాపాన కూడా పోలేదని గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర రావు గిరిబాబు, ఆంజనేయులు, కృష్ణ, ప్రవీణ్,సత్యనారాయణ, సోమయ్య, రామచందర్, మధు, కొండలరావు, వెంకన్న, రాజు,జగదీష్ గౌడ్, బాబు, వెంకన్న, రవీందర్, నరేష్, చంద్రయ్య, రాజు, వాసు, కె.వి. రావు, మోహన్ రావు, శ్రీను, నాగేష్, హరీష్, వినయ్, నవీన్, మాధవి రెడ్డి, రాధిక, రాధా, అవనిత, శైలజ, తదితరులు పాల్గొన్నారు.