

వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని, నేలకొరిగిన వరి పైరును పరిశీలించిన. బిఆర్ఎస్ నేతలు
తడిసిన ధాన్యానికి కూడా ప్రభుత్వం మద్దతు ధరను ఇవ్వాలి
నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి
జనం న్యూస్ ఏప్రిల్ 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
ఆదివారం రాత్రి మునగాల మండల వ్యాప్తంగా భారీ గాలి దురమారంతో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి నేలరాలిన ధాన్యాన్ని మరియు కల్లాల వద్ద తడిసిన వరి పంటను రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని బి ఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మునగాల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో వర్షం నీటిలో తడిసిన వరి ధాన్యాన్ని మరియు వర్షానికి నేలకొరిగిన పంట పొలాలను వారు స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు, అనంతరం వారు మాట్లాడుతూ.. రైతు ఆరుగాలం పండించిన పంట వర్షపు నీటిలో తడిసి కొట్టుకుపోయి,పంట పొలంలోనే పైరు నేలకొరిగి పొలంలోనే వడ్లు నేలరాలి స్థానిక రైతాంగం తీవ్రంగా నష్టపోయారని, కావున ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని లేకపోతే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగిరెడ్డి, లక్య నాయక్,ఎల్పి రామయ్య, గడ్డంలింగయ్య, చీకటి శ్రీను, వేట శివాజీ, నరసింహారావు, రాజేష్, నవీన్ రెడ్డి, నాగబాబు, చిరంజీవి, నవీన్, ఎల్పి వెంకయ్య, లక్ష్మయ్య, గురుమూర్తి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
