Listen to this article

జనం న్యూస్:15 ఏప్రిల్ మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్

ప్రభుత్వ డిగ్రీకళాశాల అటనమస్- సిద్దిపేటలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ జి. వైకుంఠం సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట వాస్తవ్యుడికి కళారంగంలో చేసిన సేవలకు గాను
సౌత్ ఇండియన్ కల్చరల్ ఫెస్టివల్స్ , ఉగాది పురస్కార అవార్డ్స్ లో భాగంగా ఆదివారం రోజున లోక్ కళా
మంచ్, ఆడిటోరియం, లోది రోడ్, న్యూఢిల్లీలో కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ హైదరాబాద్ మరియు ఆది లీలా ఫౌండేషన్ ఎన్జీవో న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, కళాకారుడిగా, రచయితగా, ప్రముఖ సింగర్ గా, సామాజిక కార్యకర్తగా చేసిన సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో కళా ప్రతిభా అవార్డును ఢిల్లీ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సూపరిండెంట్ డి. నాగేశ్వరరావు, శ్రీగాయత్రి ఫిలిమ్స్ సినీ నిర్మాత మంత శ్రీనివాస్ హైదరాబాద్, కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జి. ప్రభాకర్ రావు హైదరాబాద్, సీనియర్ కూచిపూడి నాట్య గురు శ్రీ సీత నాగజ్యోతి ఢిల్లీ కల్చరల్ సలహాదారు శ్రీ. అర్జున్ ఆది లీలా ఫౌండేషన్ ఎన్జీవో న్యూఢిల్లీ చైర్మన్ ఆదినారాయణ ,కనక సుధాకర్ భరతనాట్యం మరియు కూచిపూడి నాట్యం న్యూఢిల్లీ ప్రెసిడెంట్ గార్ల ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ భాజపా మంత్రివర్యులు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ. కపిల్ మిశ్రా మరియు పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీ. మంజందర్ సింగ్ ఆహ్వానించడమైనది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రివర్యులు సోమనాథ్ భరత్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్. జి. వైకుంఠం విశిష్ట అతిథిగా కూడా పిలవడం జరిగిందని సంతోషం వ్యక్తపరిచారు. అవార్డుకి ఎంపికైనందుకు కళాశాల ప్రిన్సిపల్. డాక్టర్. జి. సునీత , వైస్ ప్రిన్సిపల్ డాక్టర్. పి. అయోధ్య రెడ్డి , ఐ. క్యూ. ఏ. సి. కో ఆర్డినేటర్ డాక్టర్. సిహెచ్. మధుసూదన్ , సి.ఓ.ఈ. డాక్టర్. గోపాల సుదర్శనం , ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. శ్రద్ధానందం ఇతర ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్, ఇన్చార్జి. పి.డి. కే. విశ్వనాథం మరియు మిగతా అధ్యాపక, అధ్యాపకేతర బృందం వైకుంఠం గారిని అభినందించారు.