

ప్రజా చైతన్య సిపిఐ రాజకీయ ప్రచార ఆందోళన జాతా ముగింపు కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ పిలుపు.
జనం న్యూస్ 15 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
దేశ స్వాంత్య్ర సంగ్రామంలో భాగస్వామ్యం కాకుండా బ్రిటషోడి బుట్లు రుచి చూసి క్షమాభిక్ష అర్ధించిన సావర్కర్ మరియు గాంధీ ఉసురు తీసిన గాడ్సే, దేశ చరిత్రను వక్రీకరించి అబద్ధాలను విస్తృత ప్రచారం చేసిన గోల్వాల్కర్ వారసుల కబంధ హస్తాల్లో చిక్కి సల్యమవుతున్న భారతదేశాన్ని కాపాడుకోకపోత దేశం కోసం అతి చిన్న వయస్సులోనే ఉరికొయ్యలు ముద్దాడిన భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్ర్య భారత దేశాన్ని, అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని కార్పొరేట్లకి బిజెపి ప్రభుత్వం అప్పనంగా ధారాదత్తం చేస్తున్న మోడీ నియంతృత్వ కుట్రల అడ్డుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం విజయనగరం పట్టణంలోని ఫైనల్ వీధి జంక్షన్ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం దళిత వాడల్లో సిపిఐ విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) దేశవ్యాప్తంగా మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు నరేంద్ర మోడీ వికృత చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సిపిఐ ప్రజా చైతన్యం కోసం రాజకీయ ప్రచార ఆందోళన జాతా ముగింపు కార్యక్రమంలో భాగంగా కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 3 వ సారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, అమిత్ షాలు విచ్చిన్నకర శక్తులుగా వ్యవహరిస్తూ మతోన్మాద రాజకీయమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. మోడీ రైతు వ్యతిరేక విధానాలను తీసుకొస్తూ రైతులను దారుణంగా మోసం చేశారని ఆయన అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి నట్టేట ముంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో ఎన్నికల జరిగితే ఆ రాష్ట్రంలో ప్రముఖుల వేషధారణలో పగటి వేషాలు వేసుకుంటూ ఎన్నికల్లో ఓట్ల కోసం ఊరూరా తిరుగుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న ఈ డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను భయపెట్టి లొంగదీసుకున్నారని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్ రెడ్డి, నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా మోడీ విష కౌగిలిలో ఉన్నారన అన్నారు. నిర్మలా సీతారామన్ 10 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్థికంగా 11 సంవత్సరాల కాలంలో కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నరేంద్ర మోడీ, సీతారామన్ లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా చేశరాన్నారు. ప్రాంతీయ పార్టీల వారు మోడీ నియంతృత్వానికి భయపడి ఆయనను నెత్తిన పెట్టుకొని మోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ట్రంప్ లు లంబు జంబుల్లాగా తయారయ్యారు విమర్శించారు. మతం పేరుతో ప్రజలను విడదీసి విద్వేషాలను రెచ్చగొట్టి అంబేద్కర్ రచించి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే ధనవంతులుగా కార్పొరేట్ వర్గాలు ఎదిగేందుకు మోడీ పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వ మతోన్మాద రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని లక్ష్యంతో సిపిఐ పోరాటాలు కొనసాగిస్తుందని అన్నారు. మతం పేరుతో ప్రజలను విడదీసి విద్వేషాలను రగిలించి అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా ఆర్ ఎస్ ఎస్ మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు నరేంద్ర మోడీ కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నానాటికి నిరుద్యోగం తాండవిస్తుందన్నారు. నిత్యవసర ధరలతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని విమర్శించారు. మోడీ విధానాల వలన లౌకిక ప్రజాతంత్ర వాదానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ప్రజలంతా మేల్కొని సిపిఐ నిర్వహిస్తున్న ప్రచార ఆందోళన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అశోక్ ప్రజలకి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, మార్క్స్ నగర్ శాఖ కార్యదర్శి అప్పరుబోతు జగన్నాధం, సహాయ కార్యదర్శి బూర వాసు, బల్జివీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, వడ్డాది కొండలరావు, శాంతి నగర్ శాఖ సహాయ కార్యదర్శి వెలగాఢ రాజేష్, నాయకులు సూరిడమ్మ తదితరులు హజరయ్యారు.