

జనం న్యూస్ 15 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను శుక్రవారం ఉదయం 42వ డివిజన్ కామాక్షి నగర్, అయ్యన్న పేట వాటర్ ప్లాంట్ కూడలిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి సంఘసేవకులు, శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ, సీనియర్ వాకర్స్ సభ్యులు పల్లి శ్రీను మాష్టారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాడ్డి ఆదినారాయణ, పల్లి శ్రీను మాష్టారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆధునిక భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన మహానీయుల్లో అగ్రగామని, అణగారిన జీవితాల్లో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని, పేద కుటుంబం నుండి వచ్చిన దళితుడైన బాబాసాహెబ్ తన సమాజం ఎదుర్కొన్న దారుణాలు మరియు వివక్షను ప్రత్యక్షంగా చూసి తన జీవితకాలంలో ప్రపంచ మేధావి భీమ్‌రావ్ అంబేద్కర్ దళితుల హక్కుల కోసం పోరాడారని కొనియాడారు. కార్యక్రమంలో నడక సభ్యులు, పెద్దలు పాల్గున్నారు.