

జనం న్యూస్ – ఏప్రిల్ 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని జిల్లా బాలభవన్ (బాలవిహార్) నందు తేదీ 25 – 4 – 2025 నుండి 5 – 6 – 2025 వరకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బి బిక్షపతి తెలిపారు. బాల బాలికలలోని సృజనా శక్తిని వెలికి తీసేందుకు, కళా రంగం పట్ల అవగాహన పెంచాలనే సంకల్పంతో, విద్యార్థులందరూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వేసవి ఉచిత శిక్షణా శిబిరాన్ని జిల్లా బాల భవన్(బాలవిహార్) నాగార్జునసాగర్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు, ఈ శిక్షణా శిబిరంలో చిత్రలేఖనం ,శాస్త్రీయ నృత్యం లు నేర్పిస్తారని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారని తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ఇట్టి వేసవి శిక్షణ శిబిరానికి పంపించి వారికి కలల పట్ల ఆసక్తి పెంపొందించి వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు, ఈ వేసవి శిక్షణ శిబిరానికి సంబంధించిన వివరాలకు – 1, పర్యవేక్షకులు బాలభవన్ పి బాలు – 9440440939, 2, డ్రాయింగ్ మాస్టర్. వి మధుసూదన్ – 9490627210 లను సంప్రదించగలరని కోరారు.