Listen to this article

ట్రేడ్ యూనియన్ సెంటర్ అఫ్ ఇండియా (టియుసిఐ)జిల్లా అధ్యక్షులు గోగార్ల తిరుపతి

జనం న్యూస్ ఏప్రిల్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

మే-20వ తేదీన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని టీయుసీఐ జిల్లా అధ్యక్షులు గోగార్ల తిరుపతి,ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్,సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, ఐఎన్టీ యుసీ జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్, అన్నారు మంగళవారం కేంద్ర కార్మిక సంఘాల జేఏసీ ఆసిఫాబాద్ లోని ఎస్టీయు భవన్లో నిర్వహించిన సమావేశం ఈ సందర్బంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని అన్నారు,కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ కార్పొరేట్ల మెప్పు కోసమే కార్మిక చట్టాలను కుదించాలని ఆరోపించారు.రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు .దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైందని అన్నారు, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు..