Listen to this article

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

జనం న్యూస్,ఏప్రిల్15,జూలూరుపాడు:

తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 17న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడుతున్నామని ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టి యు సి ఐ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు తెలిపారు. మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలో గోపాలరావు మాట్లాడుతూ ఏప్రిల్ 5న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర రెండవ మహాసభలలో ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగింది.
పంచాయతీ కార్మికులకు ఉరితాడుగా ఉన్న మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని. జీవో నెంబర్ 60 ప్రకారం 15000 /- , 19500/- , 22,750/- , చొప్పున గ్రామ పంచాయితీ వర్కర్స్కు కు పెంచి అమలు చేయాలని. మల్టీ పర్పస్ జీవో 51రద్దు చేసి,గ్రామ పంచాయితీ లో పనిచేసే ప్రతి కార్మికునికి పిఎఫ్, ఈ ఎస్ ఐ, గ్రాట్యూటీ , 10 లక్షల ఇన్సూరెన్స్ చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని, సాధారణ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని. గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గ్రామపంచాయతీ కార్మికులకు కూడా నెల నెలా వేతనాలు వ్యక్తిగత అకౌంట్లో జమ చేయాలని
తదితర డిమాండ్ల సాధన కోసం ఈనెల 17 జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ( టి యు సి ఐ అనుబంధం) రాష్ట్ర మహాసభలు పిలుపు ఇచ్చిందని,కార్మికులు ధర్నా కార్యక్రమంలో అదిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని గోపాలరావు కోరారు.