Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

మేడే ను పురస్కరించుకొని జైనూర్ ,సిర్పూర్ (ఉ) లింగాపూర్ మండల కేంద్రాల్లో విద్యవనరుల కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ మండల కమిటి సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం కార్మికుల సమస్యలపై లింగాపూర్ మండల విద్యాధికారి కి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సంధర్భంగా సి.ఐ.టి.యు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటి సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ, శ్రామికుల పండుగ అయిన ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) వేడుకలను జరుపుకునేందుకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కార్మిక లోకం సన్నద్ధమైంది. ఘనంగా జరిగే మేడేకు సీఐటీయూ కార్మిక సంఘాల నేతలు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ‘నేడే మేడేనోయ్‌.. ఈనాడే మేడేనోయ్‌..’ అంటూ కార్మిక శక్తిని తెలియజేసే గీతాలు వాడవాడలా వినిపించనున్నాయి. ‘బడిలో.. గుడిలో.. సాగు భూమిలో.. కొండలు పిండిచేసే క్వారీల్లో.. ఇటుకబట్ట్టీల్లో.. మైనింగ్‌ క్వారీల్లో.. నిప్పుల కొలిమిలో.. కరకు కార్ఖానాల్లో అంతటా నువ్వే.. అన్నింటా నువ్వే.. వెలకట్టలేని త్యాగానికి అర్థం నీవు.. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక నీవు.. శ్వేదం విలువకు నిలువెత్తు నిదర్శనం నీవు.. శ్రమశక్తిని చాటిచెప్పే కార్మికుడా జోహార్‌..’ అంటూ కార్మికుల శ్రమ విలువను తెలియజెప్పే గీతాలు శామికవర్గానికి చైతన్యం కలిగించనున్నాయి. కార్మిక దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి, భవన నిర్మాణం, సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్న కార్మికులు మేడేను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడే రోజున ఉదయాన్నే కార్మిక జెండాలను ఆవిష్కరించి పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహిస్తారు. మేడే రోజంటేనే కార్మికుల పండుగ. అన్ని వర్గాల కార్మికులు ఎంతో ఆనందంగా, సంతోషంగా మేడే ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ మేరకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అనేక సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నామని. ఇప్పటికే ఆయా నిర్వహణ కమిటీలు ఆయా పనుల్లో నిమగ్నమయ్యాయి. ఆయా అడ్డాల వద్ద జెండాలను ఎగురవేసేందుకు కార్మిక సంఘాల దిమ్మెలకు రంగులు వేస్తున్నారు. తోరణాలు కట్టి జెండాలను ఎగురవేస్తారు. కార్మిక ఉద్యమంలో కార్మికుల హక్కులను నెరవేర్చే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన వీరులను తలుచుకొని వారి జ్ఞాపకాలను పంచుకుంటారనీ మేడే విశిష్టతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు కోడ్ప భింబాయి మీరాబాయి, మోతూ బాయి, మడావి లలితా, కైలాష్ సీతాబాయి సందుర్ షావ్, తో పాటు మిగితా కార్మికులు పాల్గొన్నారు.