Listen to this article

చిత్రకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి..


ప్రముఖ చిత్రకారుడు శిల్ప భాస్కర్..

జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

ప్రపంచ చిత్రకారుల దినోత్సవం సందర్భంగా జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభు ఆర్ట్స్ గ్యాలరీ లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీనియర్ ఆర్టిస్ట్ శిల్ప భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచ చిత్రకారుల దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని అన్నారు.అదేవిధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఫ్లెక్సీలు, ప్రింటింగ్ లు అభివృద్ధి కావడం వల్ల చిత్రకారులకు ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు రావడం ఉపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించలేకక ఇబ్బందులు పడి అప్పుల పాలు అవుతున్నారని అన్నారు.
నిరుపేదలైనటువంటి చిత్రకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన పథకాలు అందించాలని కోరారు.
అదే విధంగా రెండున్నర దశాబ్దాలుగా చిత్రకారుడిగా తనదైన శైలిలో చిత్రాలను గీస్తూ ప్రజలు అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల మన్ననలు పొందడం తో పాటు గత 25 సంవత్సరాలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేయడమే కాకుండా జర్నలిస్ట్ సమస్యలపై పోరాడిన గొప్ప నాయకుడిగా పని చేస్తూ ఇటీవల వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ జే ఐ) జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన అంబాల ప్రభాకర్ (ప్రభు ఆర్టిస్ట్) ను శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీనియర్ ఆర్టిస్టులు శిల్ప భాస్కర్, వీర స్వామి, బ్రహ్మం, భువనేశ్వర్, సంతోష్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భువనేశ్వర్ శ్రీరాం (ఆర్ట్) ప్రధాన కార్యదర్శి సంతోష్ (సంతు ఆర్ట్) సీనియర్ ఆర్టిస్ట్ వీర స్వామి (సిటీ ఆర్ట్& రేడియం) బ్రహ్మం (బ్రహ్మ ఆర్ట్ & రేడియం) సాయినాథ్ మెర్సీ (ఆర్ట్)
శ్రీనివాస్ ( శ్రీను ఆర్ట్) సంపత్ ( సంపత్ ఆర్ట్) హుజురాబాద్ ఆర్టిస్ట్ ప్రవీణ్ తదితరుల పాల్గొన్నారు.