

విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న హెూంగార్డ్సు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్యుల సమావేశం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 15న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – పోలీసు సిబ్బంది సంక్షేమంతోపాటు హెూంగార్డు
సంక్షేమానికి కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా హెూంగార్డ్సు ఆర్ధిక అవసరాలను తీర్చుకొనేందుకు గాను హెూంగార్డు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయబడిందన్నారు. తక్కువ వడ్డీతో కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలను మంజూరు చేసి, వారి ఆర్ధిక అవసరాలకు అండగా హెూంగార్డ్సు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నిలుస్తుందన్నారు. ఈ రుణాలతో హెూంగార్డ్సు పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాలు, ఇంటి రిపేర్లు, అత్యవసర వైద్య ఖర్చులు మరియు ఇతర ఆర్ధిక అవసరాలను తీర్చుకోగలుగుతున్నారన్నారు. ఈ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా 2023-24 సంవత్సరంకు
వచ్చిన ఆదాయ, వ్యయాలను, పోలీసు సంక్షేమానికి తీసుకున్న చర్యలను సొసైటీ సభ్యులకు హెూంగార్డ్సు కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సెక్రటరీ ఎం.సుశీల సభ్యులకు వివరించారన్నారు. హెూంగార్డ్సు తీసుకున్న సభ్యత్వం, సర్వీసు ఆధారంగా తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. హెూంగార్డ్సు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అందిస్తున్న వ్యక్తిగత రుణాలను రూ.75,000/- నుండి రూ. 1 లక్ష రూపాయలకు, వ్యక్తిగత లేదా పిల్లల వివాహాలకు ఇప్పటి వరకు మంజూరు చేస్తున్న రుణాల పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.2 లక్షలకు పెంచుతున్నామన్నారు. అదే విధంగా రుణాలపై ఇంత వరకు విధిస్తున్న 6 శాతం వడ్డీని 4.08 శాతంకు తగ్గిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు హెూంగార్డ్సు సంక్షేమానికి ఎంతో మేలు చేయనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీని మరింత అభివృద్ధి, ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యుల నుండి సలహాలను, సూచనలను స్వీకరించినట్లుగా, ప్రతీ మాసం సొసైటీ సెక్రటరీ, డైరెక్టర్లుతో సమావేశం నిర్వహించి, ముఖ్యమైన విషయాలను చర్చించి, నిర్ణయాలు చేపడతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె. చౌదరి, ఆర్ఎస్ఐ ఎన్. గోపాల నాయుడు, ఇతర పోలీసు అధికారులు, కో-ఆపరేటివ్ సెక్రటరీ ఎం.సుశీల, ఎం.నీలకంఠం నాయుడు, డైరెక్టర్లు శంకరరావు, గోపాలరావు, పి.రమణ, వి.మహేశ్వరరావు, పి.బంగారురాజు మరియు హెూంగార్డు పాల్గొన్నారు.