

జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
హత్యాయత్నానికి గురైన జనసేన నాయకుడు మహంతి దనంజయ్ను జనసేన రాష్ట్ర నాయకురాలు పడాల అరుణ మంగళవారం పరామర్శించారు. రామభద్రపురానికి చెందిన దనంజయ్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. విజయనగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దనంజయ్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అరుణ, బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి ప్రభుత్వాన్ని కోరారు.