

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 16.
తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామం లో గల ఎస్ సి పాలెం లో గల అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసిడిఎస్ సూపర్ వైజర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు, అంగన్వాడీ కార్యకర్తలు పోషకాహారం లభించే, విటమిన్లు, కలిగిన తృణదాన్యాలతో కలిగిన, ఆకు కూరలతో కలిగిన లడ్డు, పకోడీలు, బిస్కెట్స్ వంటివి ఆహారం తయారు చేసి పిల్లలకు, గర్భిణీలకు, అందజేసి ఇలాంటి ఆహారం తినాలని అవగాహన కల్పించారు అనంతరం సూపర్ వైజర్ మాట్లాడుతూ పోషణ పక్వాడ కార్యక్రమం, మహిళలు మరియు పిల్లల పోషకాహారాన్ని మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరుగుతుంది అని 15 రోజుల పాటు ఉంటుంది అని అన్నారు ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపాన్ని అరికట్టడం, రక్తహీనతను తగ్గించడం మరియు తక్కువ బరువును నియంత్రించడం వంటి లక్ష్యాలను కలిగి ఉంటుందని తెలిపి అనంతరం అవగాహన ర్యాలీ చేశారు ఈ కార్యక్రమం లో మహిళ పోలీస్ మాధవి, అంగన్వాడీ టీచర్స్ శ్రీధర పద్మావతి, భవనం సత్యనారాయణమ్మ, ఈర్ల నాశరమ్మా, పోలేబోయిన లలిత, పులుకూరి అచ్చమ్మ మహిళలు పాల్గొన్నారు
