Listen to this article

ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి – రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఐప

జనం న్యూస్,ఏప్రిల్ 17,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

నిరంతరం విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సూచించారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పోలీస్‌ అధికారులు, సిబ్బంది, హోంగార్డ్‌ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు, విశ్రాంతి పోలీస్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కమీషనరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి పోలీస్‌ కమిషనర్‌ ముఖ్య అతిధిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. రేని హాస్పిటల్ కరీంనగర్, కేర్ హాస్పిటల్ హైదరాబాద్, శ్రీకాంత్ డెంటల్ హాస్పిటల్ గోదావరిఖని, మాక్స్ విజన్ వరంగల్ ల, మంచిర్యాల ప్రభుత్వం హాస్పిటల్ డాక్టర్ సునీల్, సైకియాట్రిస్ట్ సౌజన్యంతో ఏర్పాటు ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపులో జనరల్‌ ఫిజిషియన్‌, కార్డియాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్‌, న్యూరాలజీ, గైనకాలజిస్ట్, సిపిఆర్ స్పెషలిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, కంటి విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పోలీస్‌ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అవరమైన సిబ్బంది డాక్టర్ల సూచన మేరకు షూగర్‌, ఈసిజీ, 2డిఇకో, సిఎఫ్‌టి, కంటి, దంతలకు సంబందించిన పరీక్షలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితులలో ప్రథమ చికిత్స అయిన సిపిఆర్ విధానాన్ని ఎలా చేయాలి అనేది స్పెషలిస్ట్ డాక్టర్లు సిబ్బందికి తెలియజేయడం జరిగింది. సిపి గారు కూడా స్వయంగా సిపిఆర్ చేసే విధానాన్ని చేశారు. ఈ వైద్య శిబిరంలో పోలీస్‌ కమిషనర్‌ సైతం కంటి పరీక్షలను నిర్వహించుకున్నారు. ఈ శిబిరానికి వచ్చిన పోలీస్‌ సిబ్బందిలో ఎలాంటి వ్యాధులతో భాధపడుతున్నారు. వారు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాల్సి వుంటుందని పోలీస్‌ కమిషనర్‌ వైద్యులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎర్పాటు చేసిన సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ….. ఈ వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించుకున్న పోలీస్‌ సిబ్బంది కేవలం పరీక్షలతో సరిపెట్టుకోకుండా డాక్టర్లు సూచించిన సలహాలను పాటిస్తూ సమయానికి మందులను తీసుకుంటూ సిబ్బంది ఆరోగ్యంగా వుండాలని, ముఖ్యంగా సిబ్బందికి విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్ళు వున్న ఆరోగ్యం కోసం నిరంతరం వ్యాయామం, యోగ చేయడంతో పాటు రోజు వారి జీవితంలో ఆహరపు అలవాట్లలో మార్పు అవరసమని, పోలీస్‌ సిబ్బంది ఆరోగ్యంగా వుంటే శాంతి భద్రతలు పరిరక్షణతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించగలమని, సిబ్బంది రక్షణ, ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉందని , ఈ వైద్య శిబిరంలో సహకరించిన రేని కరీంనగర్, కేర్ హైదరాబాద్, శ్రీకాంత్ డెంటల్ కరీంనగర్, మాక్స్ విషన్ వరంగల్ హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బందికి పోలీస్‌ కమిషనర్‌ అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపిలు అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏసీపీ మల్లారెడ్డి, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్ తో పాటు ఎసిపిలు, ఆర్‌.ఐ లు, ఇన్స్‌స్పెక్టర్లు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం, ఆర్‌.ఎస్‌.ఐలు ఎస్‌.ఐలు ఇతర పోలీస్‌ సిబ్బంది, రెనీ హాస్పిటల్ – కరీంనగర్ డాక్టర్ రవి కుమార్ – CTVS సర్జన్, డాక్టర్ లతీష్ రెడ్డి – క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ కె. సునీల్ కుమార్ – సైకియాట్రిస్ట్, డాక్టర్ థరోన్ అత్యవసర వైద్యుడు, కార్డియోపల్మోనరీ రిససిటేషన్ సీసీపీర్, కేర్ హాస్పిటల్ డాక్టర్స్ డాక్టర్ ముఖేష్ – కార్డియాలజిస్ట్, డాక్టర్ రమేష్ – న్యూరాలజిస్ట్బి, డాక్టర్ మధు – ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ ఫరూక్ – జనరల్ ఫిజిషియన్, డాక్టర్ ఫరియా – గైనకాలజిస్ట్, మిస్టర్ లక్ష్మణ్ – CPR స్పెషలిస్ట్, మిస్టర్ కిరణ్ – HOD, కేర్ హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్ – గోదావరిఖని డాక్టర్ శ్రీకాంత్ – డెంటల్ స్పెషలిస్ట్, మాక్స్ విజన్ – వరంగల్ డాక్టర్ నవీన్ – ఆప్తాల్మాలజిస్ట్ తదితరులు పాల్గొన్నారు.