

జనం న్యూస్: 16 ఏప్రిల్ బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్:
సిద్దిపేట పట్టణంలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ మాసోత్సవాలలో భాగంగా 18 ఏప్రిల్ శుక్రవారం రోజున అవధాని ములగ అంజయ్యచే శతాధిక ఆశుకవిత పద్య ప్రదర్శన కలదని ఆలయ నిర్వాహకులు పండరి రాధాకృష్ణ, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాలోని కవులు, కళాకారులు, గాయకులు, సాహితీ ప్రియులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.