Listen to this article

ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి పిలుపు.

జనం న్యూస్. ఏప్రిల్ 15. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్)

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాల్లో అడుగుపెట్టనున్న సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన భారీ ఎత్తున వరంగల్ లో నిర్వహిస్తున్న పార్టీ రజతోత్సవ వేడుకలకు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు,
అనంతరం హత్నూర మండలంలోని మంగాపూర్ గ్రామంలో గోడ పత్రికను‌ సునీత లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు,
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృధిలో భాగంగా రైతు సంక్షేమం,మహిళా సంక్షేమం,యువ సంక్షేమం చూసాము కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన పదహారునెలల్లో రైతులు, మహిళలు, వృద్ధులు పడుతున్న టువంటి ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ ప్రజల బతుకులు బాగుపడుతాయనె విశ్వాసంతో ప్రజలు ఉన్నారని తెలిపారు,రాబోయే స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని అలాగే మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచి అధికారంలోకి తీసుకొచ్చేవిధంగా పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో. బీఆర్ఎస్ నాయకులు. మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉమ్మన్న గారి దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వావిలాల నర్సింలు. వైస్ ఎంపీపీ పండుగ లక్ష్మి రవికుమార్. నర్సింహా రెడ్డి , రామచంద్ర రెడ్డి. దామోదర్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు.శివ శంకర్ రావు, మాజీ జెడ్పిటిసి ఆశయ్య, పిఎసిఎస్ గుండ రాములు.అర్జున్,గొల్ల కృష్ణ, మాయినిశ్రీకాంత్,కిషోర్,సురేష్ గౌడ్.మహేందర్ రెడ్డి. మేరాజ్. అజ్మత్ అలీ అజ్జు. చెక్క రవీందర్ గౌడ్.నవీన్ గౌడ్. కిషోర్ నేత. శంకర్. దూది పోశయ్య. మధు.తదితరులు పాల్గొన్నారు.