

జనంన్యూస్, 16. నిజామాబాదు. ప్రతినిధి.
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న, ఆయన ఉమ్మడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ అడిగారు. ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, మీ లాంటి ఉమ్మడి కుటుంబాలను చూడటం, మీతో కలిసి భోజనం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి కుటుంబాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారుఅనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేద, సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా వాటిని చాలామంది లబ్ధిదారులు తినేందుకు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించేవారని, సన్నబియ్యం మార్కెట్లో కొనుక్కుని తిరేవారన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్నా పేద సామాన్య ప్రజలు కడుపునిండా తినేందుకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అహ్మద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, ఇతర, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.