

ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగిలి రాకేష్..
జనం న్యూస్// ఏప్రిల్ // 16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట పట్టణ లో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న చేపల మార్కెట్ ను పాత మార్కేట్ మార్చాలని జమ్మికుంట కమీషనర్ అయాజ్ వినతిపత్రం ఇచ్చిన ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగిళి రాకేష్ ముదిరాజ్ . రాకేష్ మాట్లాడుతూ.. చేపల మార్కెట్ లో మత్స్యకారులు వేసవికాలం లో ఎండలో చేపలు అమ్మడం ఇబ్బందికారంగా వుంది అన్నారు. దానివల్ల చేపలు చనిపోవడం జరుగుతుందని తెలిపారు.అలాగే వానాకాలంలో వానలో తడుస్తూ మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారన్నారు.మత్స్యకారులు రోడ్డుపై చేపలు అమ్మడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడటం జరుగుతుంది అని మాట్లాడారు. మత్స్యకారులు పాత మార్కేట్ లో రూమ్ ఏర్పాటు చేసి చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు.