

జనం న్యూస్ జనవరి 16
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తూ ఏఎస్ఐ నుంచి ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన పలువురు పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో వారిని అభినందించి మాట్లాడారు. పదోన్నతి పొందిన ఎస్ఐలకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని చేయాలని సూచించారు