Listen to this article

ధర్మ సమాజ్ పార్టీ ( డి.ఎస్.పి ) జిల్లా ఉపాధ్యక్షులు చందు మహారాజ్ డిమాండ్.

జనం న్యూస్, ఏప్రిల్ 17( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అంబేద్కర్ ఫోటో తో కూడిన నీలిరంగు జెండాని కింద పడేసి అవమానించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు( బి ఆర్ ఎస్ ) పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే గ్రామాలలో తిరగనివ్వమని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఫోటో జెండాను అవమానించడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు, 90 శాతం మంది ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల ఓట్లు ఉంటే 5 శాతం కూడా లేని వేలకోట్ల రూపాయల భూస్వామి అయిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అహంకారానికి ( బి ఆర్ ఎస్ ) పార్టీ కి త్వరలో వచ్చే స్థానిక ఎన్నికలలో ఓటు అనే గండ్ర గొడ్డలితో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వెంటనే ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కుల సంఘాలు ఒక్కటై ఎమ్మెల్యే పదవి నుండి దింపే వరకు పోరాటం చేస్తామని ప్రకటించడం జరిగింది.