

జనం న్యూస్ ఏప్రిల్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ప్రతిభ కు గుర్తింపు ఆదరణ ఫౌండేషన్ వారు ఇరవై రెండవ వ వార్షికోత్సవ సందర్బంగా ఎక్సలెన్సీ అవార్డ్స్ లో భాగంగా రాందేవ్ రావు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కె కమలాకర్ ని ఈ సంవత్సరం ఎక్సలెన్సీ అవార్డు ఆదరణ ఫౌండేషన్ వారు ఘనంగా సత్కరించారు, ఈ అవార్డు కొరకు వ్యవస్థపాక అధ్యక్షులు రఘునాథ్ బాబు రేఖి థెరపీ గ్రాండ్ మాస్టర్ లక్ష్మి కమలాకర్ ని, ఆసుపత్రి సీనియర్ మేనేజర్ కల్పన ని ఈ ఎక్సలెన్సీ అవార్డు ను ప్రధానం చేయడం చాలా ఆనందం గా ఉందని తెలిపారు. అత్యంత అనుభవం కలిగిన వైద్య రంగం లో యాబై సంవత్సరాల అనుభవం కలిగిన, దేశ రక్షణ లో ముప్పై సంవత్సరాల తమ జీవితాలను త్యాగం చేసిన డాక్టర్ కమలాకర్ ఆర్మీ నుండి రిటైర్ అయ్యాక రాందేవ్రావు చారిటబుల్ ఆసుపత్రి అభివృద్ధి లో తన అనుభవన్ని రంగరించి, రాందేవ్రావు ఆసుపత్రి ని మరింత ముందుకు తీసుకెళ్లడం లో, తద్వారా సమాజాన్ని సేవ చెయడం లో ముందుంటారు. నిరాడంబరుడు, వినయశీలి అత్యంత క్రమశిక్షణ కలిగిన, ఆదర్శవంతమైన నాయకున్ని సత్కరించుకోవడం ఆదరణ ఫౌండేషన్ భాగ్యంగా భావిస్తుంది. వైద్య రంగంలో హీలింగ్ తృ హస్త రేఖి థెరపీ గ్రాండ్ మాస్టర్ ఐనటువంటి లక్ష్మి కమలాకర్, అటు సంసార భాద్యతలను మరియు వైద్య రంగంలో ఈ రేఖి థెరపీ ని ప్రజల్లోని కి తీసుకొని వెళ్లి అనేక. రకమైన రుగ్మతలనుండి ప్రజలను విముక్తి చేయడం, దేశం మొత్తం మీద సుమారు ఎనిమిది వందల మంది పై చిలుకు విద్యార్థుల ను తయారు చేయడమే కాకుండ, పదకొండు వందల మంది గ్రాండ్ మాస్టర్ ల ను తయారు చేసిన ఘనత శ్రీమతి లక్ష్మి కమలాకర్ దక్కుతుంది, ఈ సందర్బంగా వారిని సత్కరించుకోవడం ఆదరణ ఫౌండేషన్ అదృష్టం గా భావిస్తుంది, కల్పన మంతెన ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నానుడిని ఆదర్శం గా తీసుకొని అతి పిన్న వయసులో సేవరంగం వైపు దృష్టి సారిoచి వారికి సొంతగా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఉన్న అతి తక్కువ వేతనానికి రాందేవ్రావు ఆసుపత్రి యాజమాన్యం యొక్క సమాజానికి సేవ చేయాలనీ ఉద్దేశాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళటానికి కల్పన మంతెన కృషి చేసి అనేక రకమైన రాందేవ్రావు ఆసుపత్రి సేవ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఒక పుష్కర కాలం నుండి రాందేవ్రావ్ ఆసుపత్రి వారు చేస్తున్న సేవ కార్యక్రమం లో తనదైన ముద్రను వేసి అటు కుటుంబ బాధ్యతలను మరియు ఉద్యోగ భాద్యతలను సరిసమానం గా నిర్వర్తిస్తున్నారు వీరిని సత్కరించుకోవడం ఆదరణ ఫౌండేషన్ వారు గొప్ప అదృష్టం గా భావిస్తున్నారు.