

జనం న్యూస్ జనవరి 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
వందల మంది భక్తుల మధ్య అత్యంత వైభవోపేతంగా గురువారం ఆలయంలో ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, ఆలయ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల నాగేశ్వరరావు ని మరియు కమిటీ సభ్యులు సురువు వెంకట్రావు ,గంట విద్యాసాగర్, రంగా భాస్కర్ గౌడ్, కృష్ణ, ఏంబరి శ్రీకాంత్ ముదిరాజ్ , శారద శ్రీనివాస్, మరియు ఆలయ ప్రధాన అధ్యక్షులు కె గోపాల్ శర్మ వీరందరినీ అభినందించారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ఆలయ కమిటీలు హిందూ ధర్మ పరిరక్షణకు, సమాజ సేవకు ఉపయోగపడాలని పేర్కొన్నారు. ఆలయ కమిటీల్లో అభివృద్ధిలో ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వవద్దని సూచించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారన్నారు విదేశీ పెట్టుబడుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి ,ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, సాదు ప్రతాపరెడ్డి మరియు డివిజన్ అధ్యక్షులు మరియు డివిజన్ మహిళా అధ్యక్షురాలు కార్యకర్తలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు