Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

రైతులకు మద్దతుగా నిలుస్తాం: ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్.

చిలకలూరిపేట:రైతులు పండించిన నల్ల బర్లి పొగకు గిట్టుబాటు ధర కల్పించాలని స్థానిక తాహసిల్దార్ కార్యాలయం వద్ద రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్ రైతుల మద్దతుగా సాంఘిభావం తెలిపారు ఆయన మాట్లాడుతూ విదేశీ మార్కెట్ లో నల్ల బర్లీ పొగాకు మంచి ధర ఉందని రాజకీయ నిపుణులు,శాస్త్రవేత్తలు చెప్పుతున్నప్పటి మన రాష్ట్ర రైతుల వద్దకు వచ్చి క్వింటా రూ .3,4వేలకు ఇస్తారని బేరాసారాలు ఆడుతున్నారు.ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యాలు ఒక్కటే రైతులకు తీవ్ర మైన అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంత వాసిగా శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగా పొగాకు రైతులకు అన్యాయం జరుగుతుంది.పొగాకు ఎగుమతులపై కేంద్రానికి 2023-24 సంవత్సరం లో సుమారు 12.006 కోట్లు ఆదాయం వచ్చిందని,నల్ల బర్లీ పొగాకు విదేశాల్లో గిరాకీ ఉందని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై చొక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.రైతులు చేసే కార్యక్రమాలకు గిరిజన సంఘం నుంచి సంపూర్ణ మైన మద్దతు తెలియజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ,సిపిఎం,కాంగ్రెస్, విసికె పార్టీ నాయకులతోపాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.