

జనం న్యూస్ ఏప్రిల్ 16(నడిగూడెం)
మండలం లోని సిరిపురం అంగన్వాడీ కేంద్రం-1 ఆధ్వర్యంలో పోషణ మాసంలో భాగంగా బుధవారం టీచర్ నేలమర్రి శైలజ పిల్లల పెరుగుదల పర్యవేక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇవ్వవలసిన ఆహార పదార్థాలు, వ్యక్తిగత శుభ్రత, తాగే నీరు, ప్రతినెల ఆరోగ్య పరీక్షలు, టీకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.