

జనం న్యూస్,ఏప్రిల్16,అచ్యుతాపురం:
మండలంలోని చిప్పాడ పంచాయతీలో ఉద్దపాలెం,తాళదిబ్బ, గ్రామాలకు చెందిన సుమారు 200 మంది వైసీపీ పార్టీని వీడి మాజీ సర్పంచ్ రెడ్డి శ్రీను ఆధ్వర్యంలో రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ కండువాలు వేసి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.