Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం : వంట గ్యాస్‌ ప్రమాధాలు పై మహిళలు మెలుకవులు తెలుసుకోవాలని స్థానిక అగ్నిమాపక ఆధికారి పీఆర్‌. రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం కోటబొమ్మాళి పంచాయతీ చిన్నపొందరవీధిలో మహిళలకు అగ్నిమాపక సిబ్బంది వంటగ్యాస్‌కు మంటలు వ్యాపిస్తే ఎలాంటి , తదితర అంశాలు మహిలలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా మండే వస్తువులు దూరంగా వేయాలి. విద్యుత్‌, గ్యాస్‌ తదితర వస్తువులు ఐఎస్‌ఐ మార్కు ఉన్న వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు ఇతర మండే పదార్ధాలు అందుబాటులో ఉంచవద్దుదన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది కె. రామారావు, బి. బాలక్రిష్ణ తదితరులు ఉన్నారు.