Listen to this article

జనం న్యూస్ జనవరి 15
శాయంపేట మండల కేంద్రంలోని కుమ్మరి వీధిలో భోగి, సంక్రాంతి సంబరాల్లో భాగంగా బేరుగు తరుణ్ గోపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.మహిళలు,తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ అద్భుతమైన రంగవల్లులను భోగి,సంక్రాంతి పర్వదినాన్ని ప్రతి భింబించేలా రూపొందించారు.
ఈ పోటీల్లో మహిళలు తమ పిల్లలతో కలిసి పనిచేస్తూ జట్టుగా పోటీ పడ్డారు.ఈ సందర్భంగా బేరుగు తరుణ్ గోపి మాట్లాడుతూ పండుగ పర్వదినాన ముగ్గుల పోటీల్లో వారి సహకార స్ఫూర్తిని, కళాత్మక నైపుణ్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.అత్యుత్తమ రంగవల్లులకు ప్రధమ, ధ్వితీయ, తృతీయ, ప్రత్యేక బహుమతులను ప్రకటించారు.ఈ పోటీల్లో ప్రధమ బహుమతిగా 2016, గుండు నవ్య,ద్వితీయ బహుమతి గా 1016,దిండిగాల సుప్రియ, ప్రియ,తృతీయ బహుమతిగా సామల మిన్నుకు పట్టు చీరను బహుమతులుగా గెలుపొందారు.ఈ కార్యక్రమంలో శాయంపేట మాజీ సర్పంచ్ వలపదాసు చంద్రమౌళి,కో-స్పాన్సర్ బాసాని సాయి,ఏనుగుల శ్రావణ్, గిద్దమారి సురేష్ ఉప్పునూతల మణికేష్, ఉప్పు రమేష్, గొలుసు చరణ్, బంటి, సమీర్ డీజే, బాసాని వినయ్, రాజ్ కుమార్ గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…..