

జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
భీమిలిలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలో ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGH తరలించారు. మహిళా స్టేషన్ ACP పెంటారావు సంఘటనా స్థలాన్ని బుధవారం పరిశీలించారు.