Listen to this article

జనం న్యూస్ 16 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా మన ఊరు మనం బాగు చేసుకుందాం మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో 19 వ వార్డు మద్దిగుంత, చాకలిపేట మరియు 20 వ వార్డు వల్లూరుపేట, నడిమి మస్జీద్ తదితర ఏరియాలలో నేటి ఉదయం 6:00 గం” లకు మున్సిపల్ చైర్మన్ శ్చిన్న దేవన్న పర్యటించారు.ఈ సందర్బంగా చైర్మన్ వార్డులలోని ప్రజల ను పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, వీధిలైట్లు, డ్రైనేజి సమస్య లను గురించి ప్రత్యేకంగా ఆరా తిశారు,,పర్యటన సందర్భంగా వాల్మీకి గుడి ప్రక్కల గల గల్లీ లో రోజు సాయంత్రం వేళలో నల్లా ద్వారా నీళ్లు వదులుతున్నారని ఉదయం పూట అయితే బాగుంటుందని చైర్మన్ దృష్టికి ప్రజలు తీసుకురాగా ఒక పదిహేను రోజులు అలా ఉదయం పూట వదిలి చూడాలని లైన్ మెన్ ను ఆదేశించారు.
బోయ హమాలీ లక్ష్మన్న ఇంటి ముందు గల విద్యుత్ స్తంభం కు వీధి లైట్ లేదని కాలనీ వాసులు చైర్మన్ విన్నవించారు. వెంటనే లైట్ ఏర్పాటు చేయాలనీ ఎలక్ట్రీకల్ సిబ్బందికి సూచించాగా వారు ఇప్పుడు లైట్లు లేవని అసిస్టెంట్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లి లైట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే రానున్న నెల రోజులలో పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర ఉన్నందున వార్డుకు 20 లైట్ల చొప్పున ఇప్పించే విదంగా చూడాలని చైర్మన్ ఎలక్ట్రిషన్ సిబ్బంది కోరారు.కార్యక్రమం లో మునిసిపల్ ఇంచార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ రంగన్న వాటర్ లైన్ మెన్ శ్రీ నర్సింహులు వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు,జవాన్లు, ఎలక్ట్రీషియన్లు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు