

శ్రీరామరక్షా రథయాత్రను విజయవంతం చేయాలి
జనం న్యూస్,ఏప్రిల్17, అచ్యుతాపురం:విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ కుమార్
ఆధ్వర్యంలో ఈనెల 20 ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పూడిమడక వస్తున్న అయోధ్య శ్రీరామరక్ష రథయాత్రను మనమంతా విజయవంతం చేయాలని గురువారం పూడిమడక శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ధార్మిక సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మ రక్షా సమితి కార్యదర్శి కొల్లి అప్పారావు మాట్లాడుతూ అయోధ్య ట్రస్టు వారు, కేంద్రం వారి సలహా మేరకు శ్రీరామరక్ష రథయాత్ర బాధ్యత ఆనంద్ కుమార్ తీసుకోవడం జరిగిందని, ఇది మీ అందరి సహకారంతో మీరే ముందుకి నడిపించే బాధ్యత తీసుకొని, ప్రజల్లో హిందూ ధర్మంపై చైతన్యం తీసుకొచ్చే బాధ్యత అందరూ తీసుకోవాల్సిందిగా కోరారు. కమిటీలకు రథయాత్ర బాధ్యత అప్పగించి శోభాయాత్రగా భక్తులు వచ్చి వారి గ్రామంలోకి రథం తీసుకెళ్లి మేళ తాళాలతో ఊరేగింపు చేసే విధంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేయాలన్నారు.
విశాఖ డైరీ అచ్యుతాపురం మేనేజర్ పడాల గురునాథరావు మాట్లాడుతూ ముందురోజు కాషాయ జెండాలు అందజేస్తామని వాటిని రథం వెళ్లే మార్గాల్లో కట్టడం రోడ్డుపై అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు.ఈ
విశాఖ డైరీ సూపర్వైజర్ మల్లపురెడ్డి శ్రీను,ఆలయ అర్చకులు పులకండ గోపాలచార్యులు,మేరుగు రాజారావు, బాపయ్య, నూకాలమ్మ స్వామి, వై. బాపునాయుడు తదితరులు పాల్గొన్నారు.