Listen to this article

పంచాయతీ ప్రత్యేక అధికారి విజయ భాస్కర్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు,

జనం న్యూస్,ఏప్రిల్ 17,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల

పరిధిలోని తడ్కల్ గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు,గ్రామ పెద్దలతో కలిసి తై బజార్ వేలం పాట నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను గత సంవత్సరము నిశ్చయించిన విధంగానే వర్తక వ్యాపారస్తులు చెల్లించవలసి ఉంటుందని పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ వర్తక వ్యాపారస్తులకు గ్రామస్తులకు సూచించారు.లారీ లోడింగ్ అన్ లోడింగ్ రు 120,బొలెరో టాటా ఏస్ రు 50,ఆటో ట్రాలీ రు 30, తాడ్పల్ దుకాణాలకు రు 50, తాడ్పల్ లేకుండా నిర్వహించే దుకాణాలకు రు 30, కూరగాయల గంపకి 10 రూపాయలు అరటిపళ్ళ బళ్ళకు,చాట్ బాండార్ బళ్ళకు,చాయ్ బళ్ళకు, ప్రతినిత్యము 20 రూపాయలు,సంత మంగళవారం రోజున 30 రూపాయలు చెల్లించవలసి ఉంటుందని దిశా నిర్దేశం చేశారు.తై బజార్ వేలంపాట డబ్బులను మొదటగా 1,15,500 రూపాయలను చెల్లించి మిగతా 1,15,500 అక్టోబర్ మాసం చివరిలో కట్టవలసి ఉంటుందని అన్నారు. దిశా నిర్దేశం చేసిన విధంగా డబ్బులు చెల్లించని యెడల అతన్ని తొలగించి తైబజార్ వేలం వేయబడుతుందని అన్నారు.అనంతరం వేలంపాట గావించి లక్ష రూపాయలతో మొదలైన వేలంపాట నువ్వా నేనా అన్నట్టుగా సాగి 2,31 వేల రూపాయలకు ఎల్లుట్ల రమేష్ గౌడ్, కైవసం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.