

జనం న్యూస్. జనవరి 16. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
మండల కేంద్రమైన హత్నూర గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గత ఐదు రోజుల నుండి హత్నూర క్రికెట్ లీగ్ -3 టోర్నమెంట్ నిర్వహించగ బుధవారం నాడు అట్టహాసంగా ముగుసాయి గత ఐదు రోజులపాటు కొనసాగిన ఈ క్రీడా పోటీలలో గ్రామానికి చెందిన 8 జట్టుల క్రీడాకారులు పాల్గొన్నారు. చివరి రోజు అయిన బుధవారంనాడు సెమీఫైనల్, ఫైనల్ క్రీడా పోటీలు జరుగగా స్టార్స్ క్రికెట్ జట్టు మొదటి స్థానంలో చాలెంజర్స్ క్రికెట్ జట్టు రెండవ స్థానంలో నిలిచి బహుమతులను కైవసం చేసుకున్నారు. విజేతలకు బహుమతుల ప్రధానోస్తవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని వారు మాట్లాడుతూ. క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రశాంతతకు ఎంతో దోహదపడతాయని క్రీడల పైన యువకులు ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని నిరాశ చెందకుండా ముందుకు సాగాలన్నారు. పోటీలో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. హత్నూర గ్రామానికి చెందిన శ్రీ కీర్తిశేషులు మమ్ము భాయ్ జ్ఞాపకార్థంగా క్రికెట్ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్టులను గ్రామ పెద్దల సమక్షంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో. మాజీ సర్పంచులు .వీరస్వామి గౌడ్, ఆకుల కిష్టయ్య. కొన్యాల వెంకటేశం, గ్రామస్తులు దాసుగారి కిష్టయ్య. మాణిక్య రెడ్డి. ఆకుల నరేందర్. వరుణ్. యాదగిరి. అశోక్. షారుల్లా సాబ్. ఆసీఫ్. ఇస్మాయిల్. నాగ ప్రభు గౌడ్. పండుగ రాజు. రమేష్. కుమార్ గౌడ్. దుర్గేష్. యువకులు తదితరులు పాల్గొన్నారు.