Listen to this article

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం
కొత్తపల్లి మండలం. నిడి జింత. గ్రామంలో పందుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. పోటీల కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా మైదానాన్ని ఏర్పాటు చేశారు. తమ యజమానులను గెలిపించేందుకు పందులు ఒకదానితో ఒకటి హోరాహోరీగా తలపడ్డాయి. సంక్రాంతికి కోళ్ల పందాలు నిర్వహిస్తారు. ఇందుకు భిన్నంగా ఇక్కడ పందుల పోటీలు నిర్వహించారు. పోటీలో. గెలుపొందిన వారికి. 5000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. పోటీలను చూసేందుకు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసక్తి చూపారు.