Listen to this article

జనం న్యూస్ 18 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్‌లో నకిలీ ఫెవిక్విక్‌ ప్యాకెట్లను ఒకటవ పట్టణ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్‌ తన సిబ్బందితో కలిసి ఓ దుకాణంలో సోదాలు చేశారు. ఒరిజినల్‌ కంపెనీ పేరుతో ఉన్న పలు వస్తువులను, ఏడు బాక్స్‌ల్లో ఉన్న ఫెవిక్విక్‌ సాకెట్స్‌ను సీజ్‌ చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.