Listen to this article

జనం న్యూస్ 18 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

డీఎస్సీ తక్షణమే నోటిఫికేషన్ ప్రకటించామని చెప్పేసి 19వ తేదీన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు గారిని కలుస్తూ మాట ప్రకారం కలెక్టరేట్ పిలుపునివ్వడం జరుగుతుంది భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో గురజాడ లైబ్రరీ నందు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు బి సతీష్ అధ్యక్షత వహించరూ. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై రాము గారు.మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ చేయాలని పోరాటం చేసి డీఎస్సీ 6000 పోస్టులకు గాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీశారు. ఎన్నికలు వస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం తీసిన పోస్టులను రద్దుచేసి సూపర్ సిక్స్ లో భాగంగా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి మొదటికే డీఎస్సీ అభ్యర్థులని మోసం చేశారని ఆరోపించారు. పది నెలలు గడిచిన మొదటి సంతకాన్ని అమలు చేసే దిక్కు లేదని ఇలాంటప్పుడు వారంలో మెగా డీఎస్సీ అని ముఖ్యమంత్రి, త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికి పదిసార్లు ప్రకటనలు చేసి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులందరూ మోసం చేయబడ్డారు .రోజుకో మాట చెప్పి నిరుద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కడికి వెళితే భవిష్యత్తులో మరింత ఐక్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు . అలాగే యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు రాము గారు మాట్లాడుతూ 82 డీఎస్సీ దాదాపుగా పదేళ్లపాటు డివైఎఫ్ ఆధ్వర్యంలో ఒకవైపు చదువుతూ ఒకవైపు పోరాడి ఉద్యోగం సాధించుకున్నాం . వచ్చే ప్రభుత్వాన్ని నిరుద్యోగులు మోసం చేస్తూ అదుగో ఇస్తానని ఇదిగో ఇస్తానని అప్పట్లగె మోసం చేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి దాదాపుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉందని, ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ క్లియర్ చేసి ఇస్తామని. మార్చి నుండి చివరివరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టకపోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మొదటి వారానికి నోటిఫికేషన్ ఇస్తామని జూన్ నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు నారా లోకేష్ గారు క్లియర్ చేసి నోటిఫికేషన్ తీస్తామని హామీ ఇచ్చారు. రేపు రేపు నిరుద్యోగుల్ని మోసం చేస్తూనే ఉంటున్నారు. ఇలా రూముల్లో చదువుకుంటూ ఉంటే ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగులకు చదవడానికి సమయం ఇస్తూనే ఉంటుంది. అంతేగాని ఉద్యోగలైతే ఇవ్వదు . ఇకమీదటైనా ఒకవైపు చదువుతూ మరోవైపు పోరాటానికి పిలుపునివ్వాలని కోరుతూ నిరుద్యోగులకు ఉచిత మెటీరియల్ ఇవ్వడం జరిగింది. డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు డీఎస్సీ వచ్చేంతవరకు సపోర్ట్ చేస్తూ డివైఎఫ్ఐ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని 19వ తేదీన కొండపల్లి శ్రీనివాస్ రావు గారికి వినతిపత్రం ఇస్తూ 21 తేదీన కలెక్టరేట్ పిలుపునుఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో మురళి, సంతోష్ డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు